ప్రధాని మోదీతో భేటీ అయిన బ్రెజిల్‌ అధ్యక్షుడు

25 Jan, 2020 12:47 IST|Sakshi

ఢిల్లీ : బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో నాలుగురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. 71వ గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో జైర్‌ బొల్సొనారో అధికారికంగా బేటీ అయ్యారు. కాగా ఈ పర్యటనలో  బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సొనారో 15 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్‌ భద్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు రాష్ట్రపతిభవన్‌ వద్ద ఘన స్వాగతం లభించింది.ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ ఆయనతో కరచాలనం చేసి ఆహ్వానించారు.అనంతరం త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి  ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు వెళ్లిన జైర్‌ బొల్సొనారో  మహాత్మగాంధీకి ఘనమైన నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు