రిపబ్లిక్‌ వేడుకలకు ప్రత్యేక అతిథిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు

24 Jan, 2020 09:57 IST|Sakshi
జెయిర్‌ బొల్సోనారో

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగే 71వ గణతంత్ర వేడుకలకు బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సోనారో ప్రత్యేక అతిథిగా రానున్నారు. దీనికోసం నేడు ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక బొల్సోనారో భారత్‌లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలో జనవరి 26న జరిగే రిపబ్లిక్‌ డే వేడుకలకు హాజరవనున్నారు. అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. కాగా భారత గణతంత్ర వేడుకలకు బ్రెజిల్‌ అధక్షుడు ప్రత్యేక అతిథిగా విచ్చేయడం ఇది మూడోసారి. 2004లో తొలిసారిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు రిపబ్లిక్‌ డేకు హాజరైన విషయం తెలిసిందే.

చదవండి:

ఇకపై వీసా లేకుండానే బ్రెజిల్‌కు..

‘మతి’ పోయింది.. ఇపుడు ఓకే!

మరిన్ని వార్తలు