కేసును నీరుగార్చేందుకు కుట్ర: ఫోయినా

24 Aug, 2016 19:39 IST|Sakshi

పనాజి: గోవా బీచ్ లో జరిగిన  తన కూతురు హత్యను పోలీసులు, ప్రభుత్వం కలిసి నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నరని ఫోయినా మెకాన్ ఆరోపించారు. బ్రిటన్ కు చెందిన  స్కార్లెట్ కీలింగ్(15)  2008లో గోవా బీచ్ లో  లైంగికదాడికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే.  ఈ కేసుపై గోవాలోని చిల్డ్రన్ కోర్టులో తుది వాదోపవాలు జరుగుతున్న నేపథ్యంలో స్కార్లెట్ తల్లి  ఫోయినా మెకాన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తన కూతురు  శరీరంపై గాయాలు ఉన్నాయని, అది ముమ్మాటికీ హత్యేనని ఆమె ఆరోపించారు.

మొదట ఆత్మహత్యగా కేసును నమోదు చేసిన పోలీసులు అనంతరం ఫోయినా మెకాన్, ఆమె లాయర్ విక్రమ్ వర్మ ప్రయత్నం వల్ల హత్య కేసుగా నమోదు చేశారు. ఈ కేసును సీబీఐ కి అప్పగించిన అనంతరం కేసును నీరు గార్చేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారులు  సస్పెండ్ కు గురయ్యారు. గోవా మాజీ మంత్రి కుమారునికి ఈ కేసులో ప్రమేయం ఉన్నందువల్లే కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరుగుతుందని ఫోయినా మెకాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోవాలోని అంజనా బీచ్ లో 2008 ఫిబ్రవరి 18 న స్కార్లెట్  హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు