2020 నుంచి బీఎస్‌–6 వాహనాలే

18 Jun, 2019 04:58 IST|Sakshi

న్యూఢిల్లీ: 2020 నుంచి దేశంలో బీఎస్‌–6 ప్రమాణాలున్న వాహనాలే అందుబాటులో ఉంటాయని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ‘బీఎస్‌–6 ఇంధనాన్ని ఇప్పటికే ఢిల్లీలో వాడుతున్నాం. వచ్చేఏడాది నాటికి దేశవ్యాప్తంగా బీఎస్‌–6 ఇంధనంతో నడిచే వాహనాలే ఉంటాయి. కాలుష్యం అన్నది ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఉంది. మొత్తం కాలుష్యంలో దాదాపు 22 శాతం కేవలం వాహనాల వల్లే వస్తోంది. కాలుష్యంపై పోరాడాల్సిందే. పంజాబ్‌–హరియాణా రాష్ట్రాల్లో ఇటీవల పంట వ్యర్థాల దహనం తగ్గింది. ఢిల్లీ శివార్లలో ఇటుక బట్టీలను మూయించేశాం’ అని జవదేకర్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు