విద్యార్థులలో 'ఆధార్' భయాలు!

4 Sep, 2016 12:00 IST|Sakshi
విద్యార్థులలో 'ఆధార్' భయాలు!

రాష్ట్రంలో ఇటీవల జరిగిన టాపర్ స్కామ్ ఉదంతం తర్వాత బిహార్ విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పరీక్షలకు హాజరయ్యే  విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి చేయాలని బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్(బీఎస్ఈబీ) నిర్ణయించింది. విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా విద్యార్థుల ఆధార్ సంఖ్యను ఏదో విధంగా వారి వివరాలతో అనుసందానం చేయనున్నారు.

మరోవైపు ఈ నిర్ణయంతో విద్యార్థులతో ఆధార్ భయం పట్టుకుంది. దాదాపు 58 లక్షల మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేవు. టెన్త్, తొమ్మిదో తరగతి చదువుతున్న 32 లక్షల మంది విద్యార్థులకు, ఇంటర్ చదువుతున్న 26 లక్షల మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేని కారణంగా వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కూడా ఆలోచించి ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇలాంటి విధానాన్ని అమలుచేస్తున్న తొలి రాష్ట్రంగా బిహార్ నిలవనుంది. పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు తమ ఆధార్ నంబర్ను నమోదు చేస్తే, ఒకే విద్యార్థి పేరుతో ఒకటి కంటే ఎక్కువ హాల్ టికెట్లు జారీ అయ్యేందుకు ఆస్కారం ఉండదని బోర్డు పేర్కొంది. ఆధార్ నంబర్ రాసేందుకు ఓ ప్రత్యేక కాలమ్ ఉంటుందని బోర్డు సభ్యుడు ఆనంద్ కిషోర్ తెలిపారు.

మరిన్ని వార్తలు