పాక్‌ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతి

19 Jan, 2018 03:05 IST|Sakshi

జమ్మూ/సాక్షి, చెన్నై: భారత్‌తో సరిహద్దు వెంట పాకిస్తాన్‌ జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లోని సరిహద్దు వెంట ఆర్‌ఎస్‌ పురా, ఆర్నియా, రామ్‌గఢ్‌ సెక్టార్లలోని భారత ఔట్‌ పోస్టులపై బుధవారం రాత్రి  నుంచి పాక్‌ కాల్పులు ప్రారంభించిందని బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, హెడ్‌కానిస్టేబుల్‌ ఎ.సురేశ్‌ చనిపోయారు. ఇంకా సరిహద్దులో కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు