భారత భూభాగంలో పాక్‌ డ్రోన్‌..

8 Oct, 2019 14:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ వద్ద అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ను మంగళవారం సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) గుర్తించింది. హుస్సేనివాలా చెక్‌పోస్ట్‌ సమీపంలోని హెచ్‌కే టవర్‌ వద్ద ఈ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ పసిగట్టింది. ఈ డ్రోన్‌ భారత్‌ భూభాగంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఐదు సార్లు భిన్న ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్‌కు కనిపించింది. పాక్‌ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సరిహద్దు ప్రాంతాల్లో మందులు, ఆయుధ సామాగ్రిని చేరవేసేందుకు సాక్‌కు చెందిన ఉగ్రవాద గ్రూపులు ఈ డ్రోన్‌ను ఉపయోగించాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా సరిహద్దు వెంట ఆయుధాలు జారవిడించేందుకు ఉపయోగిస్తున్న రెండు డ్రోన్లను ఇటీవల పంజాబ్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకోవడం విశేషం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు