ఇండో పాక్‌ బోర్డర్‌ మధ్యలో కోబ్రా తీగలు

14 Mar, 2018 22:02 IST|Sakshi
గస్తీ కాస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, డాగ్‌ స్వ్కాడ్‌

సాక్షి, న్యూఢిల్లీ : దేశ సరిహద్దుల్లో కంటి మీద కునుకు లేకుండా పహారా కాసే సైనికులకు తోడ్పాటుగా భారత్‌ పాక్‌ సరిహద్దులోని హిందూమల్కోట్‌ ప్రాంతంలో గల బీఎస్‌ఎఫ్‌ పోస్టులో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత రక్షణ శాఖ ప్రవేశపెట్టింది. రాజస్థాన్‌లో ఉన్న హిందూమల్కోట్‌ ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతం. శత్రువులు దేశంలోకి చొరబడకుండా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు నిత్యం గస్తీ కాస్తుంటారు.  డాగ్‌ స్వ్కాడ్‌ కూడా గస్తీలో పాల్గొంటుంది. తాజాగా ఈ ప్రాంతంలో హ్యాండ్‌ హ్యాండిల్‌ థర్మల్‌ ఇమేజర్‌(హెచ్‌హెచ్‌టీఈ)ను ప్రవేశపెట్టారు.

దీని ద్వారా ప్రసారమయ్యే పరారుణ కిరణాలు శత్రువుల రాకను మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించగలవు. సూర్యాస్తమయ సమయం అనంతరం హెచ్‌హెచ్‌టీఈ భద్రతకు దన్నుగా నిలుస్తుంది. దీంతో పాటు సరిహద్దు వెంబడి కోబ్రా తీగలను అమర్చి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఈ కోబ్రా తీగ హై ఓల్టేజ్‌ కరెంటు కలిగి ఉంటుంది. దీన్ని సరిహద్దు ఫెన్సింగ్‌ మధ్యలో అమర్చారు. ఈ తీగలు పాకిస్తాన్‌ నుంచి చొరబాట్లను అరికడుతుంది. చొరబాటుదారుడు ఈ తీగను తాకగానే స్పృహ కోల్పొతాడు.

హెచ్‌హెచ్‌టీఈ ద్వారా జీవుల కదిలికలను కచ్చితంగా గుర్తించగల్గుతారు. గస్తీలో పాల్గొనే డాగ్‌స్వ్కాడ్‌లోని కుక్కలకు రాత్రిపూట పహారా కసేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2017 ఆగస్టులోనే బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ శర్మ ఇండో పాక్‌ సరిహద్దులో సాంకేతిక పరిజ్ఞాన అవసరాన్ని గుర్తు చేశారు. ఈ హై టెక్‌ పరిజ్ఞానాన్ని జమ్మూ కాశ్మీర్‌లో కూడా ప్రవేశ పెట్టనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు