ప్రధానిపై పోస్టింగ్‌..బీఎస్పీ నేత అరెస్ట్‌

7 Jun, 2017 14:40 IST|Sakshi
ప్రధానిపై పోస్టింగ్‌..బీఎస్పీ నేత అరెస్ట్‌

అలీగఢ్‌(ఉత్తరప్రదేశ్‌): షోషల్‌ మీడియాలో అభ్యంతకర పోస్టులపై అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర చిత్రాన్ని పోస్ట్‌ చేసిన నేరానికి బీఎస్పీ నేతను, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే అలీగఢ్‌ జిల్లా జలాలి పట్టణానికి చెందిన శంకర్‌ లాల్‌ పిప్పల్‌ బీఎస్పీ జిల్లా ఛీప్‌గా పనిచేస్తున్నాడు.

 ఈనెల 4వ తేదీన శంకర్‌లాల్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్‌ అభ్యంతరకర చిత్రాలను పోస్ట్‌ చేశాడు. దీనిని అదే పట్టణానికి చెందిన అతని స్నేహితుడు జావెద్‌ అలం షేర్‌ చేశాడు. దీనిపై జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర పాల్‌ సింగ్‌, అలీగఢ్‌ మేయర్‌ శకుంతల భారతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిద్దరిపై కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు