అన్ని వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం: మోదీ

31 Jan, 2020 10:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అన్ని వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ దిశగానే రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఉంటుందన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం బడ్జెట్‌ సమావేశాలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నామని,  ఈ సమావేశాల్లో బడ్జెట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఉభయ సభల్లో పూర్తిస్థాయిలో చర్చ జరగాలన‍్నదే తమ అభిమతమన్నారు. ఈ బడ్జెట్‌లో దళితులు, పేదలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. మరోవైపు ఆర్థిక సర్వే ప్రతులు పార్లమెంట్‌కు చేరాయి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో... పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. (పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాల నిరసన)

మరిన్ని వార్తలు