'గౌరవం సరే.. కష్టాల్ని పట్టించుకోరా?'

26 Feb, 2016 11:39 IST|Sakshi
'గౌరవం సరే.. కష్టాల్ని పట్టించుకోరా?'

న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకొని తమకు అరకొర సంతోషాన్ని మాత్రమే ఇచ్చిన కేంద్రం ప్రధాన సమస్యను మాత్రం పక్కకు పెట్టిందని రైల్వే సహాయక్ (కూలీలు)లు అభిప్రాయపడ్డారు. ఆర్థిక సమస్య తమను పట్టి పీడిస్తున్న అసలైన సమస్య అని, దీంట్లో నుంచి తమను బయటపడేసేలా నిర్ణయం తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని చెప్పారు. అయితే, బడ్జెట్ లో ప్రకటించినట్లుగా కొత్త డ్రెస్ కోడ్, కూలీలనే పేర్ల స్థానంలో సహాయక్ అనే కొత్త పేరు తమకు కొంత గౌరవాన్ని మాత్రం కట్టబెడుతుందని అభిప్రాయపడ్డారు.

'కొత్త యూనిఫాం, స్టేటస్ మాకు గౌరవాన్ని ఇస్తుంది. ఇది మా అందరికి మంచి విషయమే. కానీ మాకు అతిపెద్ద సమస్య ఆర్థికపరమైన సమస్య. దీన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. మాకంటూ ముందే నిర్ణయించబడిన రేట్లు లేనందువల్ల ప్రయాణీకులతో నిత్యం వాగ్వాదాలు తప్పడం లేదు. ప్రయాణీకులు మా కష్టం అర్థం చేసుకోరు. కేంద్ర ప్రభుత్వం కూడా తమ రైల్వే బడ్జెట్లో ఇంత వరకు ఈ విషయాన్ని స్పృషించలేదు' అని రైల్వే సహాయకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు