'దిగ్భ్రాంతి.. మొత్తం సమాజానికే సిగ్గు చేటు'

1 Aug, 2016 19:42 IST|Sakshi
'దిగ్భ్రాంతి.. మొత్తం సమాజానికే సిగ్గు చేటు'

న్యూఢిల్లీ: బులంద్ షహర్ లో తల్లి కూతుళ్లపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని, అందరూ సిగ్గుపడాల్సిన విషయం అని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియా అన్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ పునియా, కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ ప్రశ్నించారు.

'బులంద్ షహర్ లో జరిగిన ఈ ఘటన దిగ్భ్రాంతికరమైనది. మొత్తం సమాజానికి సిగ్గు చేటు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఘటనకు కొందరు పోలీసు అధికారులను బాధ్యులను చేస్తూ వారిని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. అంతకుమించి ఏమీ జరగలేదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏదో ఒక కొత్త పరిష్కార మార్గం తీసుకురావాలి. పోలీసులు అవినీతికి పాల్పడి లంఛాలు తీసుకుంటున్నారు కానీ విధులు నిర్వర్తించడం లేదు. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటివి ప్రతి రోజు జరుగుతున్నాయి. అఖిలేశ్ ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాల్సిందే' అని పునియా అన్నారు.

ఇక అనుప్రియ మాట్లాడుతూ 'ముఖ్యమంత్రి అఖిలేశ్ ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాలి. ఒక మహిళగా ఒక సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తాను. అయితే, ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనేది ప్రధాన ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం మహిళ రక్షణ తప్పకుండా చూడాలి. 2017 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు' అని అన్నారు.

>
మరిన్ని వార్తలు