మనకు సముద్రం కింద నుంచి బుల్లెట్ ట్రైన్

20 Apr, 2016 18:53 IST|Sakshi
మనకు సముద్రం కింద నుంచి బుల్లెట్ ట్రైన్

న్యూఢిల్లీ: బుల్లెట్ రైలు త్వరలో భారతీయ రైల్వేలో అడుగుపెట్టడమే ఒక గొప్ప అనుభూతి అనుకుంటే.. అంతకుమించిన మధురానుభూతి అతిత్వరలో లభించనుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రయాణించడం ద్వారా అది సొంతం కానుంది. ఎందుకంటే అరేబియా తీరం గుండా ఉండే ఈ రెండు ప్రాంతాల మధ్య నడిచే బుల్లెట్ రైలు సముద్రం కింద నుంచి పరుగులు పెట్టనుందట. దీని కోసం ఓ భారీ సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేయనున్నారు.

ముంబయి-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైలును ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ రైలు ప్రయాణించే మొత్తం 508 కిలోమీటర్లు కాగా.. అందులో 21 కిలోమీటర్లు సముద్రం క్రింది నుంచి ప్రయాణించనుంది. అందుకు ప్రధాన కారణం ధానే వద్ద ఓ పెద్ద సముద్ర చీలిక అడ్డురావడం.

ఈ నేపథ్యంలోనే ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రైలు ఏర్పాటు కోసం మొత్తం రూ.97,636 కోట్లు వెచ్చిస్తుండగా.. ఇందులో జపాన్ వద్ద నుంచే 81శాతం రుణంగా ఇస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఒప్పందం 2016 చివరినాటికి పూర్తి కానుండగా.. 2018లో పనులు ప్రారంభం కానున్నాయి.

మరిన్ని వార్తలు