ఎడ్ల బండికి చలానా

17 Sep, 2019 04:34 IST|Sakshi

న్యూఢిల్లీ: సవరించిన మోటారు వాహనాల చట్టం కింద నిబంధనల అతిక్రమణకు భారీ జరిమానాలు విధిస్తుండటం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. సోమవారం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో భారీ చలాన్లపై ప్రజలు తీవ్ర ఆందోళన చేశారు. వారి నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఉత్తరాఖండ్‌ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తుండటంతో ఆగ్రహం చెందిన డెహ్రాడూన్‌లోని చార్బా గ్రామ రైతులు రెండు మోటార్‌సైకిళ్లను తగులబెట్టారు.

కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు తమపై భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. చార్బా గ్రామానికి చెందిన రియాజ్‌ హసన్‌ అనే ఎడ్ల బండి యజమానికి పోలీసులు రూ. వెయ్యి చలానా విధించడంతో రైతుల్లో ఆగ్రహం మొదలైంది. అయితే వాహన చట్టంలో ఎడ్లబండికి చలానా విధించే నిబంధన లేదని తెలుసుకున్న పోలీసుల నాలిక్కరుచుకున్నారు. అనంతరం చలాన్‌ రద్దు చేసినప్పటికీ, రైతుల్లో ఈ విషయం తీవ్ర ఆవేదన కలిగించింది. భారీ చలాన్లపై రైతులు సోమవారం రోడ్డెక్కడంతో నిరసన హింసాత్మకంగా మారింది.

మరిన్ని వార్తలు