వణికించిన బర్మా కొండచిలువ

14 Jul, 2020 13:34 IST|Sakshi

గువాహ‌టి: ‌అతి ప్రమాదకరమైన బర్మా కొండచిలువ అసోంలో కనిపించింది. కొండచిలువలు విషపూరితం కాదు. కానీ భారీ ఆకారంతో ఎదుటివారెవరైనా హడలెత్తిస్తాయి. అందులోనూ బ‌ర్మా కొండ‌చిలువలు ప‌రిమాణంలో మ‌రింత పెద్ద‌గా ఉంటాయి. (సైనికుల అంత్యక్రియలు.. చైనా అభ్యంతరం!)

అసోంలోని నాగోన్‌ జిల్లాలోని చపనాల ప్రాంతంలో జనావాసాల మధ్య 16 అడుగులు పొడవున్న ఈ బర్మీస్‌ కొండచిలువ కన్పించింది. దీంతో వణికిపోయిన స్థానిక ప్రజలు వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలిపారు. హుటాహుటిన చేరుకున్న అధికారులు కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. (వీడని ఉత్కంఠ.. పంతం వీడని సచిన్‌)

ఈ కొండ చిలువ‌లు 10 నుంచి 15 కేజీల బ‌రువున్న జీవుల‌పైకి అమాంతం దూకి చుట్టేస్తాయి. ఆ జీవుల‌కు ఊపిరాడ‌కుండా చేసి చ‌నిపోయిన త‌ర్వాత మింగుతాయి.

మరిన్ని వార్తలు