గంగా నది ప్రక్షాళనకు కొత్త మార్గం

20 Dec, 2017 14:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గంగా నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కేంద్రమం‍త్రి సత్యపాల్‌ సింగ్‌ సష్టం చేశారు. ఆ దిశగా పురోహితులు, అర్చకులు, హిందూ ఆధ్యాత్మిక నేతలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గంగా నది కలుష్యానికి కారణమవుతున్న హిందువుల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చేందుకు అందరూ కృషి చేయాలని ఆయన చెప్పారు. గంగా నదిలో అస్థికలు కలపడం అనేది ప్రతి హిందువు ఒక నమ్మకంగా భావిస్తారు. నది కాలుష్యానికి ఇదొక ప్రధాన కారణం. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు.. అస్థికలను నదీపరివాహక ప్రాంతంలో పూడ్చిపెట్టి.. దానిపై ఒక మొక్క నాటాలని ఆయన అన్నారు. ఈ పనిచేయడం వల్ల కాలష్యం తగ్గుతుందని ఆయన తెలిపారు.

అస్థికలను గంగలో కలపడం అనేది ఒక అత్యున్నత విశ్వాసమే.. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. భవిష్యత తరాలకు గంగమ్మను పవిత్రంగా అందించాలంటే ఇలా చేయడం తప్పదని ఆయన అన్నారు. విశ్వాసాల మేరకు.. చాలా తక్కువ మోతాదులో అస్థికలను గంగలో కలిపి.. మిగిలిన దానిని పూడ్చి దానిపై మొక్క నాటితే మంచిదని ఆయన తెలిపారు. ఈ దిశగా అర్చకులు, పూజారులు, హిందూ ధార్మిక నేతలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు.

మరిన్ని వార్తలు