మహిళతో బస్సు కండక్టర్‌ అసభ్య ప్రవర్తన!

17 Feb, 2020 20:40 IST|Sakshi

బెంగుళూరు: బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల కండక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టపగలే మహిళ చెయ్యి పట్టుకుని వికృతంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటక రోడ్డు రవాణ సంస్థ(కేఎస్‌ఆర్టీసీ) బస్సులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని పుత్తూరు డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహించే ఓ ప్రబుద్ధుడు ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పుత్తూరు నుంచి హసన్‌కు బస్సులో ఓ మహిళ ప్రయాణిస్తోంది. మధ్యాహ్న సమయం కావడం.. బస్సులో ఎవరూ లేకపోవడంతో కండక్టర్‌ ప్రయాణికురాలిని లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలోనే ఆమె పక్క సీట్లోకి వెళ్లి మెల్లగా మాటలు కలిపాడు. తర్వాత చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. సదరు మహిళ కండక్టర్‌ను వారించే ప్రయత్నం చేసిన ఈ ప్రబుద్ధుడు పట్టించుకోలేదు.

ఇక లాభం లేదనుకొని సదరు మహిళ అతగాడు చేస్తున్న వికృత చేష్టలను తన మొబైల్‌ ఫోన్‌లో బంధించింది. బస్సు హసన్‌కు చేరుకోగానే బస్సు దిగిన ఆ మహిళ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో పాటు కేఎస్‌ఆర్టీసీ అధికారులకు పంపించింది. వెంటనే ఈ ఘటనపై సంస్థ యాజమాన్యం ‍స్పందించి దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాత్యాలు ఇప్పటిదాకా క్యాబ్‌లు, ఆటోలకే పరిమితం‍ కాగా.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో అది కూడా బస్సు కండక్టర్‌ ఈ దారుణానికి పాల్పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా