మహిళా ఖైదీకి కరోనా పాజిటివ్‌

10 May, 2020 14:02 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా తేలగా తాజాగా మహిళా ఖైదీకి కూడా వైరస్‌ సోకడం కలకలం రేపుతోంది. ముంబై సమీపంలోని బైకుల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళా ఖైదీకి ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను క్వారెంటైన్‌కు పంపించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ద్వారా మరెవరికైనా వైరస్‌ సోకిందా అనే కోణంలో జైలు అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. కాగా మహారాష్ట్రలో ఓ మహిళా ఖైదీకి కరోనా సోకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. (ఖైదీలకు కరోనా.. హైకోర్టు ఆగ్రహం)

కాగా మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభణపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సెంట్రల్‌ ముంబైలోని అర్థూర్‌ రోడ్‌ జైలులో ఖైదీలకు, అధికారులకు కరోనా సోకడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. జైల్లో ఖైదీలను వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆర్ధూర్‌ జైలులో 77 ఖైదీలకు, 27 మంది జైలు అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,228 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. (కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతాలివే)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు