అలరిస్తున్న ‘బై బై నిపా’

5 Jul, 2018 18:48 IST|Sakshi

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : గడగడలాడించిన ప్రాణాంతక వైరస్‌ నుంచి విముక్తి పొందితే ఎవరికైనా ఎలా ఉంటుంది? మళ్లీ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం కలిగితే మరింకెలా ఉంటుంది? ఆ అనుభూతిని ఆస్వాదించాల్సిందే గానీ అక్షరాల్లో అంత అందంగా చెప్పలేకపోవచ్చు. మరి పాటలో ! అందుకే మరి, కేరళ ప్రజలు గత మార్చి నెల నుంచి తమ తీవ్ర భయాందోళనలకు గురి చేసి నగరం నుంచి నిష్క్రమించిన ‘నిపా’ వైరస్‌కు బైబై చెబుతూ ఏకంగా ఓ పాటనే పాడారు.

ఏ షాజి కుమార్‌ పాటను రాయగా, సాయి బాలన్‌ సంగీతం సమకూర్చగా, బీబీ బాల్‌ ప్రేక్షకుల హృదయాలను కదిపేలా పాడారు. పాటకు అనుగుణంగా యువకులు, ముఖ్యంగా యువతులు సింపుల్‌గా, ఆకర్షణీయంగా నత్యం చేశారు. నిపా వైరస్‌ నుంచి ఇల్లు, వాడ, కూడలి, నగరం మొత్తం విముక్తి చెందిందన్నట్లుగా మాల్స్‌ను, బస్టాండ్లను, రైల్వే స్టేషన్లు, బీచ్‌ ఒడ్డును చూపిస్తూ కెమేరా గంతులేసింది.

నిపా వైరస్‌ సోకినట్లు మొదటి కేసు నమోదైనప్పటి నుంచి వారం రోజుల్లోగా వైరస్‌ వ్యాప్తిని కేరళ వైద్యులు అరికట్టగలిగారు. నిపా వైరస్‌ అంతం చూసే వరకూ అవిశ్రాంతంగా కృషి చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పాట సాగి, నిపాకు బైబై చెబుతూ ముగుస్తుంది.

మరిన్ని వార్తలు