మూడు హెచ్ఎంటీ కంపెనీల మూసివేత

6 Jan, 2016 15:18 IST|Sakshi
మూడు హెచ్ఎంటీ కంపెనీల మూసివేత

న్యూఢిల్లీ: హిందూస్థాన్ మెషీన్ టూల్స్ (హెచ్ఎంటీ) చెందిన మూడు కంపెనీలను మూసివేసేందుకు కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ(సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. హెచ్ఎంటీ వాచెస్, హెచ్ఎంటీ చినార్ వాచెస్, హెచ్ఎంటీ బేరింగ్స్ కంపెనీలను మూసివేయనున్నారు.

ఈ మూడు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు వీఆర్ఎస్, వీఎస్ఎస్ కింద చెల్లింపులు జరుపుతామని సీసీఈఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రూ.427.48 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించింది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులకు 2007 పే స్కేల్ కింద చెల్లింపులు జరుతామని తెలిపింది. ఈ మూడు హెచ్ఎంటీ కంపెనీలకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయిస్తామని ప్రకటించింది.
 

మరిన్ని వార్తలు