గోవ‌ధ‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు

10 Jun, 2020 11:58 IST|Sakshi

ల‌క్నో :  గోవ‌ధ‌కు  పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు అమ‌లు చేసేలా యూపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీని ప్ర‌కారం గోవును వ‌ధించిన వారికి ఏడాది నుంచి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు జైలు శిక్షతో పాటు రూ. 1 ల‌క్ష నుంచి రూ .5 లక్షల వరకు జరిమానా విధించ‌నున్న‌ట్లు తెలిపింది. మంగ‌ళ‌వారం ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా అన‌ధికారికంగా మాంసం ర‌వాణా చేసేందుకు స‌హ‌క‌రించిన డ్రైవ‌ర్‌పై కూడా జ‌రిమానా విధిస్తామ‌ని పేర్కొంది. (వూహాన్‌ను అధిగమించిన ముంబై )

గోవుల‌ను  శారీర‌కంగా హింసించినా, వాటి ప్రాణాల‌కు ముప్పు త‌ల‌పెట్టినా  చ‌ట్టంలోని  నిబంధ‌న‌ల ప్ర‌కారం  వారు శిక్షార్హుల‌వుతారని పేర్కొంది. మొద‌టిసారి నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే రూ .1 లక్ష నుంచి రూ .3 లక్షల వ‌ర‌కు జ‌రిమానా విధించగా,  రెండోసారి కూడా నేరానికి పాల్ప‌డితే శిక్ష‌ను రెట్టింపు చేస్తారు. దీనికి సంబంధించి హోంశాఖ అద‌న‌పు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  అవనిష్ అవస్థీ మాట్లాడుతూ.. గోవ‌ధ‌కు పాల్ప‌డిన నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని తెలిపారు. అంతేకాకుండా వారి ఫొటోల‌ను బ‌హిరంగ ప్ర‌దేశాల్లో అతికిస్తామ‌ని పేర్కొన్నారు. గోవ‌ధ నివార‌ణ చ‌ట్టం 1955 ప్ర‌కారం ఎవ‌రైనా గోవ‌ధకు పాల్ప‌డితే గ‌రిష్టంగా 7 సంవ‌త్స‌రాల శిక్ష ఉండేది. అంతేకాకుండా ఈ చ‌ట్టంలోని లొసుగుల‌ను వాడుకొని బెయిల్ ద్వారా బ‌య‌టికి రావ‌డం, మ‌ళ్లీ నేరాల‌కు పాల్ప‌డ‌టం లాంటివి జ‌రిగాయి. కాబ‌ట్టి ప్ర‌స్తుతం ఈ చట్టాన్ని స‌వ‌రిస్తూ మార్పులు చేశామ‌ని దీన్ని కేబినెట్ ఆమోదించిన‌ట్లు అవస్థీ పేర్కొన్నారు. (24 గంటల్లో 279 మంది మృతి )

మరిన్ని వార్తలు