కాలుష్యాన్ని పర్యవేక్షించనున్న కేబినెట్‌ కార్యదర్శి

4 Nov, 2019 05:07 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని అంచనా వేసేందుకు ఆదివారం ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి సెక్రటరీ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ఇందులో కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌ ప్రభుత్వాలతో కలిసి రోజువారీ కాలుష్య పరిస్థితులను పర్యవేక్షించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా.. మండిపోతున్న వ్యర్థాలు, నిర్మాణ పనుల కార్యకలాపాలు, పారిశ్రామిక, వాహనాల కాలుష్యంపై సమీక్షించారు. కాగా, కాలుష్యం, పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. ఉదయం 9 నుంచి ఒంటి గంట మధ్యలో 37 విమానాలను జైపూర్, అమృత్‌సర్, లక్నో, ముంబైలకు మళ్లించారు.

మరిన్ని వార్తలు