జీఎస్టీపై కాగ్‌ ఆడిట్‌

19 Nov, 2018 05:39 IST|Sakshi

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పనితీరుపై కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) ఆడిట్‌ నిర్వహించనుంది. దీనికిగానూ జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి (2017 జూలై 1) నుంచి దాని పనితీరుపై పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించనుంది. దీనిపై తుది నివేదికను త్వరలో రూపొందించనుంది. డిసెంబర్‌ 11 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ నివేదికను ప్రవేశపెట్టాలని కాగ్‌ యోచిస్తోంది. జీఎస్టీ పనితీరు సహా విధివిధానాలను పరిశీలించేందుకు కాగ్‌ బృందాలు పలు ప్రధాన రాష్ట్రాల్లోని జీఎస్టీ కమిషనరేట్లను ఇప్పటికే సందర్శించాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు