అద్వానీతో సంప్రదించాకే ఆయన పాత్రపై నిర్ణయం

14 May, 2014 20:07 IST|Sakshi

గాంధీనగర్: బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీతో సహా ఇతర సీనియర్ నేతలను సంప్రదించి వారి పాత్ర ఏమిటి అనే విషయాన్ని అగ్రనేతలు నిర్ణయిస్తారని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ, బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్ని ముక్తకంఠంతో చెబుతుండటం, నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినందున ఇతర సీనియర్ నేతల పాత్ర ఏమిటి అన్న విషయంపై రాజ్నాథ్ స్పందించారు.

నరేంద్ర మోడీతో కలిసేందుకు బుధవారం గాంధీనగర్ వచ్చిన రాజ్నాథ్ విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే అద్వానీ పాత్ర ఏమిటి అన్న ప్రశ్నకు  రాజ్నాథ్ ఆచితూచి బదులిచ్చారు. వాజ్పేయి ప్రభుత్వంలో అద్వానీ ఉప ప్రధానిగా పనిచేశారు. అంతేగాక మోడీకి అద్వానీ గురువు. మోడీ ప్రభుత్వంలో అద్వానీ పనిచేయకపోవచ్చని భావిస్తున్నారు. అద్వానీ సీనియారిటీ, పెద్దరికాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏ పార్లమెంటరీ పదవి లేదా లోక్సభ స్పీకర్ పదవి చేపట్టాల్సిందిగా కోరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు