బిహార్లో ముగిసిన నాలుగోదశ ప్రచార పర్వం

30 Oct, 2015 19:47 IST|Sakshi

పాట్నా: బిహార్లో నాలుగో దశ ఎన్నికలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచార పర్వం శుక్రవారంతో ముగిసింది. నాలుగో దశలో భాగంగా 55 స్థానాల్లో 776 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నేపాల్తో సరిహద్దు గల జిల్లాలలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు.

రెండు వారాలుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మహాకూటమి, ఎన్డీఏ నేతలతో పాటు లెఫ్ట్ పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ర్యాలీలను నిర్వహించాయి. అన్ని పార్టీలు ముఖ్యంగా అభివృద్ధి ఎజెండాగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాయి. ఇప్పటివరకు జరిగిన మూడు దశలలో మహిళలు ఆసక్తిగా ఓటింగ్లొ పాల్గొనడమే కాకుండా ఓవరాల్గా గతంలో కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. 5 వ దశ ఎన్నికల అనంతరం నవంబర్ 8న ప్రకటించే ఫలితాల్లో బిహార్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారోనని దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా