ఒకే ధరకు పెట్రోల్, డీజిల్‌ !

14 Jul, 2018 04:12 IST|Sakshi

న్యూఢిల్లీ: కార్లు, గూడ్స్‌ వాహనాలుకాని ఇతర వాహనాల విషయంలో డీజిల్, పెట్రోల్‌లకు ఒకే ధరను నిర్ణయించేందుకు వీలుందా? అని తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీజిల్‌ వాహనాల ద్వారా కాలుష్యం పెరిగిపోతోందంటూ పర్యావరణ, కాలుష్య నియంత్రణ సంస్థ (ఈపీసీఏ) వెల్లడించిన నేపథ్యంలో సుప్రీం స్పందించింది.

ఇతర భారీ వాహనాలు కాకుండా ప్రైవేటు వాహనాలు, క్యాబ్‌లకు ఒకే ధరలో పెట్రోల్, డీజిల్‌ అమ్మడంపై వివరాలివ్వాలని ధర్మాసనం సూచించింది. ‘పెట్రోల్, డీజిల్‌లకు ఒకే ధర తీసుకోవాలంటూ పెట్రోల్‌ పంపులకు ఆదేశాలివ్వగలరా?’ అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ కేసులో కోర్టుకు అమికస్‌ క్యూరీగా ఉన్న న్యాయవాది అపరాజితా సింగ్‌ వాదిస్తూ.. విపరీతమైన కాలుష్యానికి డీజిల్‌ వాహనాలే కారణమని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

>
మరిన్ని వార్తలు