యోగాతో ద్రవ్యోల్భణం,అవినీతి తగ్గుతుందా?

23 Jun, 2016 17:44 IST|Sakshi

ముంబై: బీజేపీ మిత్రపక్షం శివసేన  ప్రధాన మంత్రిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది. యోగా చేయడం వలన ద్రవ్యోల్భణం,  అవినీతి తగ్గుతుందా అని మోదీని అధికారిక పత్రిక సామ్నాలో ప్రశ్నించింది. యోగా ద్వారా వ్యక్తిగత జీవితంలోని అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చునని దేశ సమస్యలు పరిష్కరించలేమని  ప్రధానికి సూచించింది.

ఈ విషయంలో స్పష్టత ఉంటే బాగుంటుందని తెలిపింది. ప్రపంచ దేశాలతో  మోదీ యోగా చేయించారని ఇది అభినందించదగిన విషయమేనని, కానీ పాకిస్థాన్ కు శాశ్వత శవాసనం( యోగాలో విశ్రాంతి స్థితి) వేయించాలని అది ఆయుధాలతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. నల్లధనం వెనక్కి తీసుకువచ్చే విషయంలో  మోదీ తీరును  శివసేన  విమర్శిస్తున్న విషయం  తెలిసిందే.  గత కొంత కాలంగా సేన,బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

 

మరిన్ని వార్తలు