సిద్ధూ రాజీనామాపై తుది నిర్ణయం నాదే..

15 Jul, 2019 19:22 IST|Sakshi

సాక్షి, చండిఘడ్‌ : నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ రాజీనామా లేఖ అందిందని, అయితే దాన్ని చదివాకే నిర్ణయం తీసుకుంటానని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ వ్యాఖ్యానించారు.  ముఖ్యమంత్రితో సఖ్యత కుదరక ప్రముఖ మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ ఆదివారం మంత్రి పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. అయితే సిద్ధూ జులై 10నే తన రాజీనామా లేఖను రాహుల్‌గాంధీకి సమర్పించారు. ఆదివారం తన రాజీనామాపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. చివరిగా ముఖ్యమంత్రికి పంపారు. తన రాజీనామను చివరిగా ముఖ్యమంత్రికి పంపడంతోనే వీరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. సిద్ధూ రాజీనామాపై అమరీందర్‌సింగ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని నేనే కాబట్టి రాజీనామపై తుది నిర్ణయం నాదేనని, ఆ లేఖను చదివాకే స్పందిస్తానన్నారు. 

పంజాబ్‌లో కాంగ్రెస్‌పార్టీ గెలిచినప్పటి నుంచి సిద్ధూ, అమరీందర్‌ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు పలు కథనాలు వచ్చాయి. రాజకీయ నాయకుడిగా మారిన ఈ మాజీ క్రికెటర్‌ సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నాడు. కానీ చివరికి ముఖ్యమంత్రి పదవి కెప్టెన్‌కు వరించడంతో వీరి మధ్య చీలికలు మొదలయ్యాయి. అప్పటినుంచే ఉప్పు నిప్పులా ఉన్న వీరికి భారత్‌ పాక్‌ల మధ్య సిద్ధు వివాదాల తర్వాత మరింత దూరం పెరిగింది. తనకు కెప్టెన్‌ రాహుల్‌ గాంధీయేనని, తన కెప్టెన్‌(సీఎం)కు కూడా ఆయనే కెప్టెన్‌ అంటూ గత ఏడాది  సిద్ధూ వ్యాఖ్యానించడం తీవ్ర విభేదాలకు ఆజ్యం పోసింది. 

ఈ ఘటనల మధ్యనే పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ జూన్‌ 6వ తేదీన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, స్థానిక పాలన శాఖల బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించి ఇంధనం, పునర్వినియోగ ఇంధన శాఖలను కేటాయించారు. దీంతోపాటు పలు ప్రభుత్వ కమిటీల్లో సిద్దూకు స్థానం కల్పించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తి చెందిన సిద్దూ గత నెల 9వ తేదీన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని కలిసి, పరిస్థితిని వివరించడంతోపాటు ఒక లేఖను కూడా అందజేసినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన తనకు కేటాయించిన కొత్త మంత్రిత్వశాఖల బాధ్యతలను చేపట్టలేదు. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

‘కళంకిత అధికారులపై వేటు’

అప్పటివరకు ప్రశాంతం.. అంతలోనే బీభత్సం

ఆ షాక్‌ నుంచి తేరుకోని పాకిస్తాన్‌

హిమాచల్‌ గవర్నర్‌గా కల్‌రాజ్‌ మిశ్రా

‘జైలులో జాతకాలు చెప్పడం నేర్చుకుంటుంది’

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

అరగంట టైం వేస్ట్‌ అవుతోంది.. చెట్లు నరికేయండి

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

‘నా సాయం తిరస్కరించారు.. అభినందనలు’

కుప్పకూలిన జాయ్‌ రైడ్‌ : ఇద్దరు మృతి

సినిమా పోస్టర్‌ నిజమై నటుడు మృతి!

సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌

కేబినెట్‌ నుంచి సిద్ధూ నిష్క్రమణ

ల్యాండ్‌ మాఫీయాలో ఎంపీ హస్తం

కొత్త పెళ్లి జంటకు వింత పరిస్థితి

ఈనాటి ముఖ్యాంశాలు

దంతేవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరి మృతి

అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావ్‌?

రొమాన్స్‌ పేరుతో వ్యాపారి నిలువు దోపిడీ

మెట్రోలో చెయ్యి ఇరుక్కుని వ్యక్తి మృతి

బీజేపీ చీఫ్‌ విప్‌; రోడ్డుపైనుంచే విధులు..!

40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు

‘బెస్ట్‌’  బస్సు నడపనున్న ప్రతీక్ష

భార్య పోలీస్‌ డ్రెస్‌ ప్రియురాలికిచ్చి..

మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!

వదలని వాన.. 43 మంది మృతి..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!