చర్చలతోనే విద్వేషాలకు తెర

27 Nov, 2014 00:56 IST|Sakshi

భారత్, పాక్ సమస్యలపై   జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా
 
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న అపరిష్కృత సమస్యలకు చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. సార్క్ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు హాజరైన నేపథ్యంలో ఒమర్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. నాల్గో విడతలో జరగనున్న సోన్వార్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన ఒమర్ బుధవారం మీడియాతో మాట్లాడారు.

స్వయం ప్రతిపత్తికి భంగం వాటిల్లనివ్వం: ఎన్‌సీ

జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తికి కట్టుబడి ఉంటామని నేషనల్ కాన్ఫరెన్స్ తన మేనిఫెస్టోలో ప్రతినబూనింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలీ అహ్మద్ సాగర్ తదితర నేతలు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కాగా, కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని రాష్ట్రంలోని రాజకీయ పక్షాల కార్యకర్తలకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్‌బుల్ ముజాహిద్దీన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు పుల్వామా ప్రాంతంలో పోస్టర్లు వెలిశాయి.
 

మరిన్ని వార్తలు