ఉద్యోగిపై దాడి.. కౌన్సిల‌ర్‌పై కేసు న‌మోదు

18 Jul, 2020 20:38 IST|Sakshi

ల‌క్నో : ఉత్తరప్రదేశ్ మధురలో పుర‌పాల‌క శాఖలో ప‌నిచేసే ఓ ఉద్యోగిపై దాడి చేశారన్నా ఆరోప‌ణ‌ల‌తో  బిజెపి కౌన్సిలర్ దీపిక రాణి సింగ్, ఆమె భర్త పుష్పేంద్ర సింగ్ పై కేసు న‌మోదైంది. వివ‌రాల ప్ర‌కారం.. శుక్ర‌వారం మ‌ధుర మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వీంద‌ర్ కుమార్, అత‌ని వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడిపై కౌన్సిలర్ దీపిక రాణి భౌతిక దాడికి పాల్ప‌డింది. ఈ విష‌యంపై ఆమెను వివ‌ర‌ణ కోర‌గా.. త‌న ప్రాంత స‌మ‌స్య‌లు, అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి క‌మిష‌న‌ర్‌తో మాట్లాడుతుండ‌గా, త‌న ప‌క్క‌న కూర్చోమ‌ని బ‌ల‌వంతంగా చేయి ప‌ట్టుకున్నాడ‌ని ఆమె ఆరోపించించారు.

అయితే దీపికారాణి ఆరోప‌ణ‌లను ర‌వీంద‌ర్ కుమార్ కొట్టిపరేశారు. మున్సిప‌ల్ ప‌రిధిలోని ప్రాంతాల‌కు రూపొందిన బ‌డ్జెట్‌కి సంబందించి ఓ స‌మావేశం ఏర్పాటుచేయ‌గా కౌన్సిలర్లు, ఉన్న‌తాధికారులు స‌హా ఎమ్మెల్యేలందరూ హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. అయితే స‌మావేశం ప్రారంభించ‌డానికి కొంత స‌మ‌యం ముందు కౌన్సిల‌ర్ వాణి కావాల‌నే ఒక ర‌భ‌స సృష్టించిందని ఆరోపించారు. ఆమెను శాంతింప‌జేయ‌డానికి త‌న  పీఏ ప్ర‌య‌త్నించ‌గా అత‌డ్ని చెప్ప‌ల‌తో కొట్టింది అని పేర్కొన్నాడు. కార్పొరేషన్ తరపున ఘ‌ట‌న‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామ‌ని తెలిపాడు. 
(ఆలీ పేరిట నకిలీ ట్విటర్‌ అకౌంట్​)


.

మరిన్ని వార్తలు