టిక్‌ టాక్‌ వీడియో.. నలుగురిపై కేసు

19 Oct, 2019 16:35 IST|Sakshi

గాంధీనగర్‌ : టిక్‌టాక్‌.. ఇది ఇప్పుడు పరిచయం​ అక్కర్లేని పేరు. దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ ఉంటుంది. అయితే సరదా కోసం వాడాల్సిన ఈ  వీడియో షేరింగ్ యాప్‌ను కొంతమంది అనవసర విషయాలకు ఉపయోస్తూ ఇబ్బందుల్లో పడుతున్నారు. లైక్‌, కామెంట్ల కోసం పిచ్చి పిచ్చి వీడియో చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా టిక్‌టాక్‌ మోజులో పడిన నలుగురు గుజరాత్‌ యువకులు బతికున్న కొండచిలువను మంటల్లో వేసి కాల్చి చంపారు. ఈ తతంగానంతా వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అయింది.

వీడియోను చూసి ఫారెస్ట్‌ అధికారులు ఆ యువకులపై కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా యువకుల అడ్రస్‌ కనుగొన్న అధికారులు.. వారి ఇళ్లపై తనిఖీలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. వీడియో ఆధారంగా ఇద్దరి నిందితులను గుర్తించామని, మరో ఇద్దరి వివరాలు కూడా సేకరించి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. జంతు హింస నిరోదక చట్టం ప్రకారం.. నిందితులకు మూడు నుంచి ఏడేళ్ల శిక్షతో పాటు రూ.10వేలు నుంచి 25 వేల వరకు జరిమాన విధించే అవకాశాలు ఉన్నాయని సీనియర్‌ పోలీసు అధికారి పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు