కమల్‌పై కేసు నమోదు

3 Nov, 2017 18:36 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: హిందూ తీవ్రవాదంపై వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమల్‌ హాసన్‌పై కేసు నమోదైంది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 511, 298, 295(ఏ), 505(సీ) కింద అభియోగాలు నమోదు చేశారు. కమల్‌ ఇటీవల రాసిన  ఓ వ్యాసంలో దేశంలో హిందూ తీవ్రవాదం పెచ్చరిల్లిందని, హిందూ తీవ్రవాదం లేదని ఎవరూ ప్రశ్నించలేరని, హిందువుల్లోనూ తీవ్రవాదం ప్రబలిందని కమల్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే.త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న కమల్‌పై నమోదైన అభియోగాలపై శనివారం విచారణ నిర్వహిస్తారు.

కమల్‌ హాసన్‌పై నమోదైన ఆరోపణలకు, నమోదైన సెక్షన్లను పరిశీలిస్తే..సెక్షన్‌ 500 కింద కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు శిక్ష విధిస్తారు. 511 కింద నేరాలకు పూనుకోవడం, సెక్షన్‌ 298 కింద పరుష వ్యాఖ్యలతో  ఏ వ్యక్తి మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, సెక్షన్‌ 295(ఏ) కింద మత విశ్వాసాలాను, మతాన్ని కించపరచడం ద్వారా ఏ వర్గంవారి మత భావాలను దెబ్బతీయడం, సెక్షన్‌ 505(సీ) కింద ఒక వర్గం, మతాన్ని ఇతర మతం, వర్గంపై దాడులకు పురికొల్చేలా వ్యవహరించడం వంటి అభియోగాలను కమల్‌ హాసన్‌పై నమోదు చేశారు.

మరిన్ని వార్తలు