97 మంది మృతి: కేంద్రమంత్రిపై కేసు నమోదు

17 Jun, 2019 17:37 IST|Sakshi

97కి చేరిన బిహార్‌ చిన్నారుల మృతుల సంఖ్య

నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిపై ఫిర్యాదు

పట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధితో చిన్నారులు మృతిచెందుతున్న విషయం తెలిసిందే. వ్యాధికి కారణమైన అక్యూట్ ఎన్‌సిఫలైటిస్ సిండ్రోమ్‌పై అవగహన కల్పించడంలో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్థన్‌ విఫలమయ్యారని బిహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రితో సహా, రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి మంగల్‌ పాండే పేరును కూడా ఫిర్యాదులో పొందుపరిచారు. ఆమె ఫిర్యాదు మేరకు ముజఫర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 323, 308, 504 ప్రకారం కేసు ఫైల్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పెద్ద సంఖ్యలో పిల్లలు మృతి చెందుతున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ నెల 24న పిటిషన్‌పై ముజాఫర్‌పూర్‌ కోర్టు విచారణ చేపట్టనుంది.

ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారులు బలవుతున్నారు. ఇప్పటి వరకు 97 మంది చిన్నారులు మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో శ్రీకృష్ణ, కేజ్రీవాల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారే అధికం. అంతే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కాగా బిహార్‌లోని ఓ ఆసుపత్రిని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమీక్షించిన విషయంతెలిసిందే. మరోవైపు సీఎం నితీష్‌ కుమార్‌ కూడా వైద్యులతో సమావేశమై.. ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.

కాగా, కేంద్రమంత్రి కళ్లెదురే ఓ చిన్నారి చికిత్స పొందుతూ మరణించింది. ఓ వైపు పిల్లలు చనిపోయిన బాధ, మరోవైపు తమ పిల్లల్ని కాపాడంటి అంటూ ఆవేదనతో ఆసుపత్రుల వద్ద తల్లిదండ్రలు చేస్తున్న అర్థనాదాలు ఆకాశాన్నంటాయి. మెదడు వాపు వ్యాధి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని డాక్టర్లు తెలిపారు. అక్యూట్ ఎన్‌సిఫలైటిస్ సిండ్రోమ్‌కు అధిక ఉష్ణోగ్రతలు, గాల్లో తేమశాతం ఎక్కువగా ఉండడమే కారణమని వెల్లడించారు. వర్షాలు పడితే పరిస్థితిలో మార్పు వస్తుందని, మరణాలు కూడా తగ్గే అవకాశముందని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

‘కళంకిత అధికారులపై వేటు’

అప్పటివరకు ప్రశాంతం.. అంతలోనే బీభత్సం

ఆ షాక్‌ నుంచి తేరుకోని పాకిస్తాన్‌

హిమాచల్‌ గవర్నర్‌గా కల్‌రాజ్‌ మిశ్రా

‘జైలులో జాతకాలు చెప్పడం నేర్చుకుంటుంది’

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

అరగంట టైం వేస్ట్‌ అవుతోంది.. చెట్లు నరికేయండి

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

‘నా సాయం తిరస్కరించారు.. అభినందనలు’

కుప్పకూలిన జాయ్‌ రైడ్‌ : ఇద్దరు మృతి

సినిమా పోస్టర్‌ నిజమై నటుడు మృతి!

సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌

కేబినెట్‌ నుంచి సిద్ధూ నిష్క్రమణ

ల్యాండ్‌ మాఫీయాలో ఎంపీ హస్తం

కొత్త పెళ్లి జంటకు వింత పరిస్థితి

ఈనాటి ముఖ్యాంశాలు

దంతేవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరి మృతి

అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావ్‌?

రొమాన్స్‌ పేరుతో వ్యాపారి నిలువు దోపిడీ

మెట్రోలో చెయ్యి ఇరుక్కుని వ్యక్తి మృతి

బీజేపీ చీఫ్‌ విప్‌; రోడ్డుపైనుంచే విధులు..!

40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు

‘బెస్ట్‌’  బస్సు నడపనున్న ప్రతీక్ష

భార్య పోలీస్‌ డ్రెస్‌ ప్రియురాలికిచ్చి..

మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!

వదలని వాన.. 43 మంది మృతి..!

ఆధార్‌ నెంబర్‌ తప్పుగా సమర్పిస్తే భారీ ఫైన్‌!

దారుణం: భార్యాభర్తల గొడవలో తలదూర్చినందుకు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!