సీఎం ఎడిటెడ్‌ వీడియో పోస్ట్‌ .. దిగ్విజయ్‌పై కేసు

15 Jun, 2020 10:35 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు సంబంధించి ఎడిటెడ్‌ వీడియోను షేర్‌ చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై భోపాల్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. (కరోనా భయం : ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య)

సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌పై ఒక తప్పుడు వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఆయన షేర్‌ చేసినట్లు పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన భోపాల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద దిగ్విజయ్‌ సింగ్‌పై కేసు నమోదు చేశారు. లిక్కర్‌కు సంబంధించి మాట్లాడిన పాత వీడియోను ఎడిట్‌ చేసి పోస్ట్‌ చేశారని, వీడియో శివారాజ్‌ సింగ్‌ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని బీజేపీ పేర్కొంది. ‘బుదిన్నిలోని గిరిజనులను శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఏజెంట్లు రూ.450కోట్లమేర మోసగించారు. ఆ సమయంలో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదు. ఆ సంఘటనపై చర్యలు తీసుకోకపోతే ఆయన ఇంటి ముందే నిరసన చేపడతానని లేఖ వ్రాశాను. ఇది బీజేపీని కలవరపరిచింది. వీడియోను ఎవరు ఎడిట్‌ చేశారో తనిఖీ చేయాల్సి ఉంది’ అని దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. (24 గంటల్లో 11,502 పాజిటివ్‌ కేసులు)

మరిన్ని వార్తలు