మరో ఎమ్మెల్యే విద్యార్హతలు ఫేకే

8 Jul, 2015 16:01 IST|Sakshi

అగర్తల: విద్యార్హతకు సంబంధించి తప్పుడు ధృవపత్రాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల్లో మొన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత జితేందర్ సింగ్ తోమర్ మునిగిపోయి ఉండగా.. తాజాగా త్రిపురకు చెందిన కేశబ్ దెబ్బార్మా అనే ఎమ్మెల్యేపై కూడా ఇలాంటి కేసు నమోదైంది. కేశబ్ సీపీఎం పార్టీకి చెందిన నేత. ఎన్నికల సమయంలో కేశాబ్ తప్పుడు విద్యార్హతలు పేర్కొంటూ పత్రాలు సమర్పించారని ఆరోపిస్తూ మిధుపాల్ అనే వ్యక్తి బిషాల్ ఘఢ్ కోర్టులో గత జూలై 4న ఫిటిషన్ వేశారు.

దీంతో ఆ పిటిషన్ను పరిశీలించిన కోర్టు పోలీసులకు అనుమతి ఇవ్వడంతో మంగళవారం ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు సీపీఎం వెంటనే కేశబ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. 2008 నుంచి 2013 వరకు గులాఘాటి నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కేశాబ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు విద్యార్హతలు పేర్కొన్నారని కేసునమోదయింది.

మరిన్ని వార్తలు