పరుగుల రాణికి నగదు పురస్కారం       

31 Aug, 2018 13:21 IST|Sakshi
ద్యుతీచాంద్‌

 రూ.1.5 కోట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి

భువనేశ్వర్‌ : జకార్తాలో జరుగుతున్న 18వ ఏషియన్‌ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన ద్యుతీ చాంద్‌ వరుసగా పతకాల్ని సాధిస్తోంది. తాజాగా ఆమె 200 మీటర్ల పరుగు పందెంలో రెండో రజత పతకం సాధించింది. లోగడ 100 మీటర్ల పరుగు పందెంలో తొలి రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆమెకు రెండోసారి రూ.1.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించారు. త్వరలో జరగనున్న ఒలింపిక్‌ క్రీడల పోటీ సాధనకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి గురు వారం ప్రకటించారు.

రెండో రజత పతకం సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆమెతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలియజేశారు. ఏషియన్‌ క్రీడల్లో రెండు రజత పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా ద్యుతీ చాంద్‌ సరికొత్త రికార్డు నెలకొల్పింది.   జాతీయస్థాయిలో ఆమె రెండో క్రీడాకారిణిగా స్థానం సాధించడం మరో విశేషం. లోగడ 1982లో న్యూ ఢిల్లీలో జరిగిన ఏషియన్‌ క్రీడల పోటీల్లో పి. టి. ఉష 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందాల్లో రెండు రజత పతకాల్ని సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచారు.   

మరిన్ని వార్తలు