ఆ నేరగాళ్లకు రాజీ అవకాశం ఉండదు

18 Jun, 2019 04:49 IST|Sakshi

కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన సీబీడీటీ  

న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా, ఉగ్రవాదులకు నిధుల చేరవేత, బినామీ ఆస్తులను, రహస్యంగా విదేశీ ఆస్తులను కలిగి ఉండటం, అవినీతి తదితర నేరాలకు పాల్పడేవారికి ఇక నుంచి ఐటీ విభాగంతో రాజీ కుదుర్చుకునే అవకాశాన్ని కల్పించకూడదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ)  నిర్ణయించింది. పై నేరాలకు పాల్పడేవారు రాజీ కుదుర్చుకునే హక్కును కోల్పోతారంది. అయితే నేరస్తుడి ప్రవర్తన, నేరం స్వభావం, తీవ్రత, నేరానికి పాల్పడేందుకు ప్రేరేపించిన పరిస్థితులు తదితరాలను పరిగణనలోనికి తీసుకున్న అనంతరం, అవసరమనుకుంటే ఆ వ్యక్తులు/సంస్థలకు రాజీ అవకాశం ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థిక మంత్రికి ఉంటుందని స్పష్టం చేసింది. 

>
మరిన్ని వార్తలు