ఓబీసీ కుంభకోణంలో పంజాబ్‌ సీఎం అల్లుడు

27 Feb, 2018 03:22 IST|Sakshi
అమరీందర్‌ (ఫైల్‌)

న్యూఢిల్లీ: దాదాపు రూ.109 కోట్ల ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌(ఓబీసీ) కుంభకోణం కేసులో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పంజాబ్‌ సీఎం అమరీందర్‌ అల్లుడిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఘజియాబాద్‌లోని సింభావోలీ షుగర్స్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌ గుర్మిత్‌ సింగ్‌ మన్, సీఎం అల్లుడు, కంపెనీ డిప్యూటీ ఎండీ గుర్పాల్‌ సింగ్‌లపై కేసులు పెట్టింది.

రైతులకు రుణాలు అందిస్తామంటూ ఓబీసీ నుంచి ఈ సంస్థ 2011లో రూ.148 కోట్ల రుణం పొందింది. దానిని రైతులకు చెల్లించకుండా సంస్థ ఖాతాకు మళ్లించారు. ఈ రుణం చెల్లించటానికి గాను ఓబీసీ నుంచి 2015లో మరో రూ.110 కోట్ల రుణం పొందింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ.109 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించిన సీబీఐ ఆదివారం గుర్పాల్‌పై కేసులు పెట్టి కొన్ని చోట్ల సోదాలు కూడా నిర్వహించింది.
 

మరిన్ని వార్తలు