హూడా, వోరాలపై సీబీఐ చార్జిషీట్‌

2 Dec, 2018 11:20 IST|Sakshi

న్యూఢిల్లీ: భూ కేటాయింపు కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌ హూడా, కాంగ్రెస్‌ నేత మోతీలాల్‌ వోరాలపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది.  పంచకులలో అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు కేటాయించిన స్థలం విషయంలో అవకతవకలు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. పంచకులలోని స్థలం మోతీలాల్‌ వోరా చైర్మన్‌గా ఉన్న ఏజేఎల్‌కు కేటాయించిన విషయంలో ఖజానాకు రూ.67 లక్షలు నష్టం వాటిల్లిందని ప్రత్యేక కోర్టులో సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఏజేఎల్‌ గాంధీ కుటుంబ సభ్యులు, ఇతర కాంగ్రెస్‌ పెద్దల అధీనంలో నడుపబడుతున్న సంస్థ. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ఏజేఎల్‌ ఆధ్వర్యంలో వెలువడుతున్న విషయం విదితమే. 

మరిన్ని వార్తలు