ఉన్నావ్‌ కేసు : బీజేపీ ఎమ్మెల్యేపై చార్జిషీట్‌

11 Jul, 2018 17:39 IST|Sakshi
బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్‌ లైంగిక దాడి కేసులో నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌పై సీబీఐ బుధవారం చార్జిషీట్‌ దాఖలు చేసింది. లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడైన కుల్దీప్‌ సెంగార్‌ ప్రస్తుతం విచారణ ఖైదీగా జైలులో ఉన్నారు. గతంలో బాధితురాలి తండ్రి హత్యకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే సోదరుడుతో పాటు మరో నలుగురిపై సీబీఐ తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది.

సెంగార్‌ సోదరుడు జై దీప్‌ సింగ్‌, ఆయన అనుచరులు వినీత్‌ మిశ్రా, వీరేంద్ర సింగ్‌, రామ్‌ శరణ్‌ సింగ్‌ అలియాస్‌ సోను సింగ్‌, శశి ప్రతాప్‌ సింగ్‌ అలియాస్‌ సుమన్‌ సింగ్‌లపై చార్జిషీట్‌ నమోదైంది. వీరంతా ఉన్నావ్‌ జిల్లాలోని మాఖి గ్రామానికి చెందిన వారని అధికారులు తెలిపారు. కాగా నిందితులపై హత్య, సంబంధిత నేరాభియోగాలు నమోదు చేశామని సీబీఐ ప్రతినిధి తెలిపారు. ఉన్నావ్‌ లైంగిక దాడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు