ఫరూక్‌ అబ్దుల్లాపై సీబీఐ ఛార్జ్‌షీట్‌

17 Jul, 2018 08:53 IST|Sakshi
ఫరూక్‌ అబ్దుల్లా (ఫైల్‌ ఫోటో)

జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ పేరుతో నిధుల దుర్వినియోగం : సీబీఐ

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాపై సోమవారం సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. కశ్మీర్‌లో క్రికెట్‌ స్టేడియంలు, అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ కొరకు బోర్డు ఆఫ్‌ క్రికెట్‌ కంట్రోల్‌ ఇండియా (బీసీసీఐ) నుంచి 38 కోట్లు నిధులు తీసుకుని దుర్వినియోగపరిచారని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో  పేర్కొంది. ఫరూక్‌తో పాటు జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ (జేకేసీఎ) మాజీ చైర్మన్‌ మహ్మద్‌ అస్లాం గోని, జేకేసీఏ సెక్రటరీ సలీమ్‌ ఖాన్‌, కశ్మీర్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బషీర్‌ అహ్మద్‌ల పేర్లు కూడా సీబీఐ ఛార్జ్‌షీట్‌  పెర్కొంది.

2015 నుంచి హైకోర్టు ఆదేశాల మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు, ఫరూక్‌ అబ్దుల్లాను విచారణకు హాజరుకావల్సిందిగా సమన్లు పంపినట్లు సీబీఐ అధికారి ఎస్‌ఎస్‌ కిషోర్‌ తెలిపారు. జేకేసీఏ మాజీ చైర్మన్‌ అస్లాం గోని నిధుల అవకతవకలపై ఫిర్యాదు చేయడం విశేయం. కశ్మీర్‌లో క్రికెట్‌ స్టేడియంల నిర్మాణం కోసం తీసుకున్న నిధులను బ్యాలెన్స్‌ షీట్‌లో పెందుపరచలేదని, 50 కోట్లతో స్డేడియం, 27 వేలతో మౌలికవసతులు కల్పించామని తెలిపారు. ఫరూక్‌కు అతి సన్నిహితుడైన గోని అతనితో విభేదించి కాంగ్రెస్‌ పార్టీలో చెరారు. నిధుల దుర్వినియోగంపై సీబీఐతో విచారణ జరిపించడం జేకేసీఐ చైర్మన్‌గా తన నైతిక బాధ్యతని పేర్కొన్నారు. ప్రస్తుతం కుటంబంతో బ్రిటన్‌లో గడుపుతున్న ఫరూక్‌ దేశం తిరిగి రాగానే విచారణకు హాజకుకావల్సిందని సీబీఐ ఆదేశించింది.

మరిన్ని వార్తలు