రూ.80 లక్షలు, ఫోర్డ్‌ కారు కోసం..

2 Jan, 2020 18:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రూ 80 లక్షలు, ఫోర్డ్‌ కారు కోసం నాగాలాండ్‌ రాజకీయ నేతను చంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్న గ్యాంగ్‌స్టర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. గత ఏడాది మే 17న యూపీ రాజధాని లక్నోలో గ్యాంగ్‌స్టర్‌ విజయ్‌ ఫర్మానాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసిన అనంతరం రాజకీయ నేతను చంపేందుకు జరిగిన కుట్ర విషయం వెలుగుచూసింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హోంమంత్రిత్వ శాఖ కేసు విచారణను చేపట్టాలని సీబీఐని కోరింది.

లోక్‌సభ ఎన్నికల అనంతరం నాగాలాండ్‌ నేతను హతమార్చాలన్న ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫర్మానా తన అనుచరులతో కలిసి నాగాలాండ్‌ వెళ్లినట్టు సీబీఐ విచారణలో వెల్లడైంది. కాగా, ఫర్మానా టార్గెట్‌ చేసిన నాగాలాండ్‌ రాజకీయ నేత ఎవరనేది వెల్లడించేందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు. తనను ఈ హత్యకు ఎవరు పురమాయించారు, ఇది రాజకీయ కుట్రా కాదా అనే వివరాలు రాబట్టేందుకు ఫర్మానాను త్వరలో కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు