'ఇంట్రెస్ట్‌ లేనట్లుంది మీకు'.. సీబీఐపై హైకోర్టు ఆగ్రహం

16 Oct, 2017 14:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనిపించకుండాపోయిన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ను కనిపెట్టే విషయంలో పూర్తి నిర్లక్ష్యంతో ఉన్నట్లుందని వ్యాఖ్యానించింది. ఏబీవీపీ విద్యార్థుల దాడి అనంతరం తమ కుమారుడు కనిపించకుండాపోయాడని నజీబ్‌ అహ్మద్‌ తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును విచారించే బాధ్యతను సీబీఐకి ఐదు నెలల కిందట ఢిల్లీ హైకోర్టు అప్పగించింది.

అయితే, ఇన్ని రోజులైనప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. 'ఎలాంటి పురోగతి లేదు.. కనీసం పేపర్‌పైనైనా ఎలాంటి ఫలితాలు లేవు. ఈ కేసుపై సీబీఐకి ఏమాత్రం ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. అసలు ఆ విద్యార్థి జాడ తెలుసుకుంటారా లేదా' అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు