ఐఎన్‌ఎక్స్‌ కేసు : ఇంద్రాణి ముఖర్జియాను ప్రశ్నించిన సీబీఐ

10 Sep, 2019 17:43 IST|Sakshi

ముంబై : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి ముఖర్జియాను సీబీఐ అధికారులు మంగళవారం బైకుల్లా జైలులో ప్రశ్నించారు. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం అరెస్టయిన సంగతి తెలిసిందే. కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ బైకుల్లా జైలులో ఖైదుగా ఉన్నారు. చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు, మనీల్యాండరింగ్‌ కేసుల్లో ఆమె అప్రూవర్‌గా మారారు. కాగా ఐదు దేశాలకు పంపిన లెటర్‌ ఆఫ్‌ రెగొటరీస్‌ల విషయంలో​ తలెత్తిన ప్రశ్నలకు ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ఇంద్రాణిని సీబీఐ విచారించినట్టు సమాచారం. కుమార్తె హత్య కేసులో నిందితులైన ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్‌ ముఖర్జియాలు ఐఎన్‌ఎక్స్‌ మీడియా గ్రూప్‌ ప్రమోటర్లు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు