క్రైమ్‌ మాన్యువల్‌ అప్‌డేట్‌

12 Sep, 2019 08:39 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాదాపు 14 ఏళ్ల తర్వాత తమ క్రైమ్‌ మాన్యువల్‌లోని ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని(ఎస్‌వోపీ) అప్‌డేట్‌ చేయనుంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగా ఈ సవరణలు చేపట్టనుంది. ఇందుకోసం సీబీఐ అదనపు డైరెక్టర్‌ ప్రవీణ్‌ సిన్హా నేతృత్వంలో ఓ బృందం గత 10 నెలలుగా పనిచేస్తోందని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. క్రైమ్‌ మాన్యువల్‌కు సంబంధించి కొత్త విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కొత్త చట్టాలు రావడం, సైబర్‌ నేరాలు అధికం కావడం, పలు కేసులకు సంబంధించి విదేశీ విచారణ సంస్థలు సాయం కోరుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సవరణలు చేపడుతున్నామని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు