చిదంబరంనకు సమన్లు

2 Jun, 2018 05:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణంపై ఈనెల 6వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంనకు సీబీఐ సమన్లు జారీ చేసింది. మే 31వ తేదీనే సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా చిదంబరం విజ్ఞప్తి మేరకు 6వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో జూలై 3వ తేదీ వరకు చిదంబరంను అరెస్టు చేయరాదంటూ ఢిల్లీ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మీడియా ప్రముఖులు పీటర్‌ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణిలు ప్రమోటర్లుగా ఉన్న ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ గత ఏడాది కేసు నమోదు చేసింది. ఈ కేసులో రూ.10 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలపై చిదంబరం కుమారుడు కార్తీని సీబీఐ ఇప్పటికే అరెస్ట్‌ చేసింది. 

మరిన్ని వార్తలు