సీబీఐ నన్నయితే నిమిషంలో జైల్లో పెట్టుండేది: మోడీ

26 Oct, 2013 20:45 IST|Sakshi
సీబీఐ నన్నయితే నిమిషంలో జైల్లో పెట్టుండేది: మోడీ

బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్తో పాటు సీబీఐపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో ప్రధాని మన్మోహన్ సింగ్పై తీవ్ర ఆరోపణలు వచ్చినా సీబీఐ పామును చూసి భయపడుతున్నట్టుగా నిశ్శబ్దంగా ఉందని విమర్శించారు. అవే ఆరోపణలు తనపై వచ్చుంటే నిమిషంలో తనను జైల్లో పెట్టుండేదని మోడీ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజస్థాన్లో శనివారం జరిగిన మోడీ ఎన్నికల ప్రచార సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

కేంద్రం రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని మోడీ ఆరోపించారు. 'బొగ్గు కుంభకోణంలో ప్రధానిపై వచ్చిన ఆరోపణలు బీజేపీ నాయకులు వసుంధర రాజే, నరేంద్ర మోడీ, శివరాజ్ సింగ్ లేదా రమణ్ సింగ్పై వచ్చుంటే సీబీఐ మమ్మల్ని నిమిషంలో అరెస్ట్ చేసి జైల్లో ఉంచేది. అయితే ప్రధాని విషయంలో సీబీఐ పామును చూసి భయంతో బిగుసుపోయినట్టుగా మౌనంగా ఉంది' అని మోడీ అన్నారు.

>
మరిన్ని వార్తలు