జూలై 1 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు

19 May, 2020 05:10 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్‌డౌన్, ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కారణంగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ(సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) ప్రకటించింది. నిలిచిపోయిన 10, 12వ తరగతి పరీక్షలను జూలై ఒకటి నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బోర్డ్‌ సోమవారం తెలిపింది. 10వ తరగతి పరీక్షలు ఈశాన్య ఢిల్లీలో అల్లర్లతో నిలిచిపోగా, 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలు కారణంగా వాయిదా పడ్డాయి. 12వ తరగతి విద్యార్థులకు జూలై 1న హోం సైన్స్, 2న హిందీ, 7న కంప్యూటర్‌ సైన్స్, 9న బిజినెస్‌ స్టడీస్, 10న బయో టెక్నాలజీ, 11న జియోగ్రఫీ, 13వ తేదీన సోషియాలజీ పరీక్షలుంటాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు