ఫ‌లితాలు వ‌చ్చిన రోజు ఇదీ ప‌రిస్థితి!

15 Jul, 2020 21:02 IST|Sakshi

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు వెలువ‌డిన విషయం తెలిసిందే. 10వ త‌ర‌గతిలో 91.46 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇది గ‌తేడాదితో పోలిస్తే 0.36 శాతం అధికం. ఇక ప‌న్నెండ‌వ త‌ర‌గ‌తిలో 88.78% ఉత్తీర్ణ‌త న‌మోదైంది. అయితే ఇప్పుడు మొద‌ల‌వుతుంది విద్యార్థుల‌కు అస‌లు ప‌రీక్ష‌. అవునండోయ్‌.. ప‌రీక్ష‌లు రాసేవ‌ర‌కు అస‌లు పాసవుతామా? లేదా? అని తెగ భ‌య‌ప‌డిపోతుంటారు. తీరా ఫ‌లితాలు వ‌చ్చాక ప‌రిస్థితి ఇంకోలా ఉంటుంది! మంచి మార్కులు వ‌స్తే వాళ్లే అంద‌రికీ ప‌నిగ‌ట్టుకుని మ‌రీ ఫోన్ చేస్తారు. (54 ఏళ్ల క్రితం మిస్సింగ్‌.. ఇప్పుడు దొరికింది)

అంద‌రిచేత అడిగించుకుని మ‌రీ మార్కులు చెప్పుకుంటారు. ఆ సంతోష‌మే వేరు. కానీ మార్కుల సంగ‌తి దేవుడెరుగు.. క‌నీసం పాస్ అయినా అవ‌క‌పోయారో! ఇప్ప‌టిదాకా చెప్పుకున్న‌దంతా త‌ల‌కిందులవుతుంది. గ‌ది దాటి బ‌య‌ట‌కు కూడా వెళ్లలేరు. ఎందుకంటే..  'ఏంట‌మ్మాయ్/ ఏంట‌బ్బాయ్ ఎన్ని మార్కులు అంటూ బంధువులు, పొరుగింటి వారు, ప‌క్కనుండే వీధిలోని ఆంటీ అంకుళ్లు.. ఆఖ‌రికి దుకాణానికి వెళ్తే షాపువాడు కూడా ఇదే ప్ర‌శ్న అడుగుతాడు. అప్పుడు విద్యార్థుల ప‌రిస్థితి క‌క్క‌లేక‌, మింగ‌లేక అన్న‌ట్లుగా ఉంటుంది. సీబీఎస్ఈ ఫ‌లితాలొచ్చిన స‌మ‌యంలో ప్ర‌స్తుతం విద్యార్థుల ప‌రిస్థితి ఇదీ అంటూ సోష‌ల్ మీడియాలో ఫ‌న్నీ మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. (వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తే ఇన్ని రోగాలు!)

ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌గానే ల‌క్ష‌లాది మంది విద్యార్థులు సైట్ ఓపెన్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. అప్పుడు అది ఓపెన్ అవ‌కుండా విద్యార్థుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది. నేను చెప్ప‌నుగా అంటూ స్టూడెంట్స్‌తో దాగుడుమూత‌లాడుతుంది. ఇక నీకు మంచి మార్కులు రాక‌పోతే.. మీ నాన్న రియాక్ష‌న్.. నువ్వు నా ర‌క్తం కాద‌ని ఈరోజు నిరూపించావ్‌రా అంటూ ఓ సీరియ‌స్ లుక్కిస్తాడు.

ఇక కొంద‌రు బంధువులుంటారు. అస‌లు ఫ‌లితాలింకా వెల్ల‌డించ‌క‌ముందే మార్కులెన్ని వ‌చ్చాయ్‌? అంటూ ఫోన్లు చేసి విసిగిస్తూనే ఉంటారు. వారి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక విద్యార్థులు ఇదిగో ఇలా ప్ర‌వ‌ర్తిస్తారంటూ ఓ మీమ్ అంద‌రినీ న‌వ్విస్తోంది. (ఈ ఫొటో చూసి మీ మాస్కు తినేయ‌కండి)

మరిన్ని వార్తలు