మే 23న సీబీఎస్ఈ 12 క్లాస్ ఫలితాలు!

19 May, 2016 14:33 IST|Sakshi
మే 23న సీబీఎస్ఈ 12 క్లాస్ ఫలితాలు!

న్యూఢిల్లీః సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ ఈ ) 12 తరగతి ఫలితాలను మే 23న ప్రకటించనుంది. ఈ సంవత్సరం మార్చి 1న ప్రారంభమై ఏప్రిల్ 22 తో ముగిసిన క్లాస్ 12 పరీక్షలకు  మొత్తం 10,67,900 మంది అభ్యర్థులు హాజరై పరీక్షలు రాశారు. కాగా... మేనెల, ఆఖరి వారంలో సీబీఎస్సీ క్లాస్ 12, 10 పరీక్షా ఫలితాలను వెల్లడిస్తామని ఇంతకు ముందే తెలిపిన సీబీఎస్సీ బోర్డ్... ఈ నెల 23న 12 వ తరగతి ఫలితాలు వెల్లడించనుంది. అనుకున్న ప్రకారం జరిగితే  నెలాఖరులోపు పదోతరగతి ఫలితాలు కూడ వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

మే 23వ తేదీన వెల్లడయ్యే 12వ తరగతి ఫలితాలను అభ్యర్థులు అధికారిక సీబీఎస్ఈ డాట్ నిక్ డాట్ ఇన్ (cbse.nic.in) లో పరిశీలించవచ్చని బోర్డు సూచించింది. అలాగే తమ రోల్ నెంబర్లను ఇతర వెబ్సైట్లలో కూడ చూసుకోవచ్చని తెలిపిన బోర్డు... వెబ్సైట్ లో అడిగిన అన్ని వివరాలను అభ్యర్థులు నమోదు చేసిన తర్వాతే ఫలితాలు కనిపిస్తాయని స్పష్టం చేసింది.  స్క్రీన్ పై వచ్చిన ఫలితాల జాబితాను భవిష్యత్ ఉపయోగాలకోసం డౌన్ లోడ్ లేదా  ప్రింట్ తీసుకొని పెట్టుకోవడం మంచిదని అభ్యర్థులకు బోర్డు సలహా ఇచ్చింది.

గతేడాది సీబీఎస్ ఈ 12వ తరగతి పరీక్షలకు మొత్తం 10,40,368 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 43,29,85 మంది బాలికలు, 607,38,3 మంది బాలురు ఉన్నారు. ఈసారి మొంత్తం 14,99,122 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవ్వగా, వారిలో 44,66,41 మంది బాలికలు, 607,38,3 మంది బాలురు ఉన్నారు.

మరిన్ని వార్తలు